వేపపుల్లలు ఆన్ లైన్ లో అమ్ముతున్నారు రేటు ఎంతో తెలిస్తే షాక్

It would be a shock to know the rate at which neem stick is being sold online

0
89

గతంలో మన పెద్దలు పేస్టులు వాడేవారు కాదు కేవలం వేప పుల్లలు కచ్చికల బూడిద మాత్రమే వాడేవారు. వాటితో పళ్లు తోముకునేవారు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కాని ఇప్పుడు అంతా కెమికల్ పేస్టులు అనేక రసాయనాలతో పేస్టులు తయారు చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఇలా వేప పుల్లలు వాడటం వల్ల దంతాలకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.
వేపపుల్లలు, ఉత్తరేణి పుల్లలు, పసుపు, ఉప్పు ఇవన్నీ మన పళ్లకు ఎంత మేలు చేసేవి.

ఇలా వేప పుల్లతో తోముకుంటే చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు నోటి దుర్వాసనని కూడా నివారిస్తుంది.
ఈ రోజుల్లో చాలా మంది వేప పుల్లలతో పళ్లు తోముకుంటున్నారు. మళ్లీ కొందరు వేపనే వాడుతున్నారు, ఇక విదేశాల్లో కూడా వేపకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు అక్కడ ఈ వేప పుల్లలు ఆన్ లైన్ లో అమ్ముతున్నారు.

ఉచితంగా మనకు ఇక్కడ దొరికే వేపపుల్లలు అమెరికాలో కొనుక్కుని మరీ వాడుతున్నారు. అమెరికాలో మాత్రం ఒక వేప పుల్లను అక్షరాలా రూ.1800 వినడానికి ఆశ్చర్యంగా ఉందా అవును. నీమ్ ట్రీ ఫామ్స్ అనే ఈ-కామర్స్ కంపెనీ వీటిని ప్యాక్ చేసి అమ్ముతోంది. చూశారుగా మనకు ఉచితంగా దొరికినా వాడం కాని వారు డబ్బులు పెట్టి మరీ కొనుక్కొని వాడుతున్నారు వాటి విలువ తెలిసి.