జియో బంపర్ ఆఫర్..ఒక్క రూపాయికే డేటా ప్యాక్..!

Geo bumper offer..Data pack for only one rupee ..!

0
110

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో మరో అదిరిపోయే ప్రీపెయిడ్ ఆఫర్​ను తీసుకొచ్చింది. రూ.1కే ప్రత్యేక ప్లాన్‌ను అందిస్తోంది. ఇది ఓ డేటా ఓచర్. దీనితో వినియోగదారులకు 30 రోజుల వ్యాలిడిటీతో 100ఎంబీ డేటాను అందిస్తోంది జియో.

దీనితో రూ.1కే ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందించే మొట్టమొదటి ఆపరేటర్‌గా అవతరించింది జియో. ఈ ఓచర్‌తో రూ.10 వెచ్చించి పదిసార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనితో 30 రోజుల పాటు 1జీబీ డేటా లభిస్తుంది.

అవసరమైన మేరకే డేటా కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడనుంది. అయితే.. మొబైల్ యాప్‌లో మాత్రమే కనిపిస్తున్న ఈ ప్లాన్.. ఇతర వెబ్‌సైట్‌లలో కనిపించపోవడం గమనార్హం.