నటాషా పూనావాలా హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఎంతో చూడండి

Look at the Natasha Poonawala handbag cost

0
102

ధనవంతుల లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందో తెలిసిందే. క్రికెటర్లు, సినిమా స్టార్లు, పారిశ్రామిక వేత్తలు వారి లగ్జరీ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు వాడే లగ్జరీ గూడ్స్ లక్షల నుంచి కోట్ల రూపాయల విలువైనవి ఉంటాయి. జ్యూవెలరీ నుంచి కాళ్ల చెప్పులు, హ్యాండ్ బాగ్స్ ఇలా అన్నీ చాలా కాస్ట్ లీగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది.

నటాషా పూనావాలా తెలుసు కదా. సీరం సంస్థ సీఈవో ఆధార్ పూనావాలా భార్య . ఇక ఆమె చాలా లగ్జరీగా ఉంటారు. ఆమె చాలా కాస్ట్ లీ హ్యాండ్ బ్యాగ్స్ వాడుతూ ఉంటారు. ఆమె ప్రపంచంలో అనేక కంపెనీల ఖరీదైన హ్యాండ్ బ్యాగ్స్ కొంటూ ఉంటారు. అది ఎంత ఖరీదు అయినా ఆమెకి నచ్చిందంటే కచ్చితంగా కొంటారు.

ఇటీవల వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్లను నటాషా వీక్షించింది. ఆ టోర్నీ చూసేందుకు ఆమె ఓ ఖరీదైన బ్యాగ్తో వెళ్లింది. హెర్మిస్ కంపెనీకి చెందిన ఆ హ్యాండ్బ్యాగ్ ఖరీదు అక్షరాల 82 లక్షలట. అక్కడ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాతో కలిసి ఫోటో దిగింది. ఇందులో ఆ ఖరీదైన బ్యాగ్ కనిపించింది. ఇది చూసిన అభిమానులు ఈ బ్యాగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు చూడవచ్చు.

https://www.instagram.com/p/CRMvvROFjka/?utm_source=ig_embed&ig_rid=2aa97366-2a63-4f38-8c9b-76a0812ff5c6