యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా? అయితే ఈ 5 విషయాలు తప్పక గుర్తుంచుకోండి..

0
114

ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. అంతా ఆన్ లైన్ ట్రాన్సక్షనే. క్షణాల్లో డబ్బును ఒక ఖాతా నుండి మరో ఖాతాలోకి పంపియవచ్చు. అయితే యూపీఐ పేమెంట్స్ తో లాభాలున్నా ఏమరుపాటు ఉంటే క్షణాల్లో ఖాతా ఖాళీ. అందుకే గూగుల్ పే, ఫోన్ పే ఉపయోగించే వాళ్లు ఈ జాగ్రత్తలు పాటిస్తే UPI అకౌంట్లను హ్యాక్ కాకుండా ఉంటుంది.

మీ 6 లేదా 4-అంకెల UPI పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయకూడదు.

UPI ప్రారంభ యాప్ ప్రతి లావాదేవీకి ముందు PINని అడుగుతుంది.

మీరు మీ UPI IDకి మీ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసినప్పుడు.. మీరు సీక్రెట్ PINని సెటప్ చేయాలి.

ఆ తరువాత ATM పిన్ మాదిరిగానే సురక్షితమైన పేమెంట్లు చేసుకోవచ్చు.

అయితే ఈ UPI PIN వ్యక్తిగతంగా ఉంచాలి. ఎవరికి షేర్ చేయరాదు.

మీ ఫోన్‌కి స్క్రీన్ లాక్‌ పెట్టుకోండి :

మీ ఫోన్‌లో చాలా ముఖ్యమైన యాప్‌లు, ఈమెయిల్‌లు, ఇతర ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీరు ఎల్లప్పుడూ మీ ఫోన్‌లో లాక్‌ని ఉంచాలి. UPI యాప్‌ ద్వారా సురక్షిత లావాదేవీ కోసం యాప్‌ను ఓపెన్ చేయవచ్చు. ముందుగా మీ ఫోన్ లాక్ స్క్రీన్ పాస్‌వర్డ్‌ కూడా అడుగుతాయి. మీ ఫోన్ ఎవరైనా దొంగిలించినా లేదా దుర్వినియోగమైనా మోసం జరిగే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. మరింత జాగ్రత్తగా ఉండటానికి లాక్ స్క్రీన్ పాస్‌వర్డ్‌ను తరచుగా మారుస్తూ ఉండాలి.

ఒకటి కన్నా ఎక్కువ UPI యాప్‌లను ఉపయోగించొద్దు :

మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన మల్టీ UPI యాప్‌లతో గందరగోళంగా ఉంటుంది. అనేక UPI యాప్‌లను ఉపయోగించరాదు. దీంతో మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు ఎవరికైనా ఏ యాప్ నుంచి అయినా UPI లావాదేవీలను ఉచితంగా చేయవచ్చు. UPI ఇంటర్‌ ఆపరేబుల్ ఏదైనా బ్యాంక్ లేదా UPI యాప్‌ని ఉపయోగించి ఇద్దరు UPI యూజర్ల మధ్య లావాదేవీలు చేయవచ్చు. ఎవరైనా మీది కాకుండా వేరే యాప్‌ని ఉపయోగిస్తుంటే.. వారి ఫోన్ నంబర్‌ని ఉపయోగించి చెల్లించవచ్చు. కానీ, మీరు ఎప్పుడైనా వారి QR కోడ్‌ని స్కాన్ చేయవచ్చు లేదా వివిధ యాప్‌లలో లావాదేవీలకు UPI IDని అడగవచ్చు.

అనుమానిత లింక్‌లపై క్లిక్ చేయొద్దు :

యూపీఐ యూజర్లు SMS లేదా ఈమెయిల్ ద్వారా ఏదైనా లింక్‌లు వస్తే వాటిని క్లిక్ చేయొద్దు. అదో ఫ్రాడ్ క్లిక్ స్కామ్‌కు అని గుర్తించుకోండి. మీ ఫోన్‌లో ధృవీకరించని లేదా ఫిషింగ్ వంటి ఏవైనా లింక్‌లపై క్లిక్ చేయొద్దు. మీ ఫోన్‌ను హ్యాక్ చేసేందుకు మీ గుర్తింపుతో పాటు మీ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, పిన్‌లను దొంగలించే అవకాశం ఉంటుంది. ఈ లింక్‌లు తరచుగా కనిపిస్తుంటాయి.