Flash: సామాన్యుల‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సీలిండర్ ధ‌ర‌

Massively increased gas cylinder price

0
112

అనుకున్నదే జరిగింది. అందరూ ఊహించనట్లుగానే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పైకి కదిలొచ్చింది. ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధం కార‌ణంగా పెట్రోల్, డిజిల్ తో పాటు బంగారం, వెండి, గ్యాస్ ధరలు పెరుగుతాయ‌ని మార్కెట్ నిపుణులు హెచ్చరించారు. అందుకు అనుగుణంగానే మార్చి 1న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ అందించాయి.

ఈ మేరకు సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కొత్త రేట్లు ఈరోజు నుంచే అమలులోకి వచ్చాయి. దీనితో సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. ఈ ఒక్క రోజే 19 కిలో గ్రాముల వాణిజ్య‌ గ్యాస్ ధ‌ర ఏకంగా రూ. 105 మేర పెరిగింది. అలాగే 5 కిలో గ్రాముల వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పై రూ. 27 వ‌ర‌కు పెరిగింది.

కాగా మార్చి 7 తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మార్చి 7న ఉత్తరప్రదేశ్ ఏడో విడత ఎన్నికలు ముగుస్తాయి. అందువల్ల ప్రభుత్వం మళ్లీ గ్యాస్ సిలిండర్‌ను పెంచొచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఈసారి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే.. సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.