సికింద్రాబాద్ లో మెగా జాబ్ మేళా..

0
73

కరోనా వల్ల భారీగా తగ్గిపోయిన ఉద్యోగాల నోటిఫికేషన్స్ మళ్ళి ఊపందుకున్నాయి. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ కంపెనీలు సైతం తమ కంపెనీలలో చేర్చుకోవడానికి పెద్ద ఎత్తున ఉద్యోగాలను ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం కేసులు తగ్గడంతో కంపెనీలు ముందడుగు వేస్తున్నాయి. దీనివల్ల నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా సెట్విన్ తో పాటు ధృవ కన్సల్టెన్సీ వంటి వివిధ సంస్థల సహకారంతో సికింద్రాబాద్ లో ఈ నెల 7వ తేదిన ఓ మెగా జాబ్ మేళా నిర్వహిస్తునారు. సితాఫలమండీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా లో 35 కు పైగా పేరొందిన ప్రయివేటు, కార్పోరేట్ సంస్థలు పాల్గొంటున్నాయి.

గౌరవ ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ జన్మ దినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో పదో తరగతి, ఇంటర్,డిప్లొమా, బీ ఫార్మసీ, హోటల్  మేనేజ్ మెంట్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీ జీ, ఎం బీ ఏ , ఎం సీ ఏ వంటి అన్ని విద్యార్హతల వారికి అనువైన ఉద్యోగాలు కల్పిస్తున్నారు. జంట నగరాలకు చెందిన కనీసం రెండున్నర వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా జరుపుతున్న ఈ జాబ్ మేళాను ప్రధానంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సితాఫలమండీ, బౌద్ధనగర్ మునిసిపల్ డివిజన్లకు చెందిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోగలరని నిర్వాహకులు సూచిస్తున్నారు.

ఏప్రిల్ 7 వ తేది ఉదయం నుంచి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ వద్ద స్పాట్ రిజిస్ట్రేషన్ లకు అవకాశం కల్పిస్తారు. అదే విధంగా ఆన్లైన్ ద్వారా సైతం నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకొనే అవకాశం ఉంది. గతంలో సికింద్రాబాద్ పరిధిలో 7 జాబ్ మేళలను ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ నిర్వహించి ఏడు వేలకు పైగా నిరుద్యోగులకు ఉపాధిని కల్పించారు. ఈ నెల 7 వ తేదిన నిర్వహించే జాబు మేళాను నగరానికి చెందిన నిరుద్యోగులు, ప్రధానంగా సికింద్రాబాద్ కు చెందినవారు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకుంటే మంచి ఉపాధిని పొందుతారు.