మెగా జాబ్‌ మేళా.. 60 కి పైగా కంపెనీలు హాజరు.. ఇదే చివరి తేదీ?

0
102

కరోనా వల్ల భారీగా తగ్గిపోయిన ఉద్యోగాల నోటిఫికేషన్స్ మళ్ళి ఊపందుకున్నాయి. దాంతో ఉద్యోగాల జాతర మొదలయింది. ప్రస్తుతం కేసులు తగ్గడంతో కంపెనీలు సైతం పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. దీనివల్ల నిరుద్యోగులకు మంచి అవకాశం వచ్చినట్టే.

ఈ క్రమంలోనే తాజాగా టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్‌ మోహన్ రావు జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నారు. ఆదివారం (ఏప్రిల్ 3) రోజున ఈ జాబ్‌మేళాను కామారెడ్డిలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పలు ప్రైవేటు కంపెనీలు కూడా  పాల్గొంటున్నాయి. పెద్ద ఎత్తున ఖాళీలను భర్తీ చేయనున్నాయి. జాబ్‌మేళాలో ఏయే కంపెనీలు పాల్గొంటున్నాయి. ఎలా రిజిస్టర్‌ చేసు కోవాలనుకుంటున్నారా.అయితే పూర్తి వివరాలు మీకోసం..

* జాబ్‌మేళాలో పీవీఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌బీఐ కార్డ్‌, మెడ్‌ ప్లస్‌, జయభేరి ఆటోమోటివ్‌, అపోలో ఫార్మసీ, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌తో పాటు మరికొన్ని కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొంటున్నాయి..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకొని నేరుగా ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి హాజరుకావాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు ముందుగా ఈ లింక్‌ను క్లిక్‌ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.

* లింక్‌ ఓపెన్‌ చేసిన తర్వాత వాట్సాప్ నంబర్, మొబైల్ నంబర్, విద్యార్హతల వివరాలు నమోదు చేయడంతో పాటు రెజ్యూమ్‌ సాఫ్ట్‌కాపీని అప్లోడ్ చేయాలి.

* అనంతరం సబ్‌మిట్ బటన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

* ఏప్రిల్‌ 3న కామారెడ్డిలోని పార్శి రాములు ఫంక్షన్‌ హాల్‌లో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.