దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుల నడ్డివిరుస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం కూడా చమురు ధరలను మరోసారి పెంచుతూ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతున్న ధరలను తగ్గించాలని వాహనదారులు కోరుతున్నప్పటికీ..పెరగడం మాత్రం ఆగడం లేదు. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు శుక్రవారం లీటరు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. వరుసగా పెరుగుతున్న ధరలతో దేశంలో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి.
హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.113 కి చేరగా..డీజిల్ ధర రూ.106.22కి పెరిగింది.
ఏపీలోని విజయవాడలో పెట్రోల్ ధర 114.50కి చేరగా..డీజిల్ ధర 107కి ఎగబాకింది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు పెరిగి రూ.105.40 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 33 పైసలు రూ.101.55కు చేరింది.