ఎమ్మెల్యే రోజా కూతురికి అరుదైన గౌరవం

Ms. Rose's daughter on the cover of Burn Achiever Magazine

0
93

వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత ఇన్ఫ్లూఎన్సర్- UK మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫొటోను ప్రచురించడం విశేషం. రచయితగా, ఎంట్రప్రెన్యుయర్ గా , ప్రోగ్రామర్‌గా సమాజం కోసం పాటు పడుతున్నందుకు గానూ యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపికైనట్లు సంస్థ ప్రకటించింది.

దీనిపై స్పందించిన అన్షూ …తన కల నెలవేరిందని సంతోష పడింది. కాగా ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై క్వీన్ ఆఫ్ టాలెంట్ గా ఆమె ఫోటో వేశారు. ఇంతకీ రోజా ముద్దుబిడ్డ అన్షు మల్లికా ఏం రగంలో అడుగుపెట్టిందో తెలుసా? ‘సాహిత్యం’.

ఈ కాలం పిల్లలు అంతా ఆధునిక ఐటీ ఫ్యాషన్ సహా ఇన్నోవేషన్ రంగాల్లో ముందుకెళుతుంటే..రోజా కూతురు మాత్రం సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించి భాషపై పట్టు సాధించి సృజనాత్మకతతో ముందుకెళుతోంది. ఆమె ప్రతిభకు ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.