ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను తిరిగి లాభాల బాటలో పట్టించడానికి టాటా గ్రూప్ ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ఎయిర్ ఇండియాకు సీఈవోగా కొత్త వ్యక్తిని టాటా సన్స్ నియమించింది. టర్కిష్ ఎయిర్ లైన్స్ కు చైర్మెన్ గా పని చేసిన ఇల్కర్ ఐసీని ఎయిర్ ఇండియాకు సీఈవోగా నియమించింది.