ఆగని పెట్రో బాదుడు..సామాన్యులకు చుక్కలు!

Non-stop pet duck..dots for the common people!

0
100

ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా పెట్రోల్​, డీజిల్​పై మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు​, డీజిల్​పై 36 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.111.87కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.105.04 కి చేరింది.

గుంటూరులో పెట్రోల్ ధర లీటర్​కు రూ.113.89కి చేరింది. డీజిల్​పై 35 పైసలు పెరిగి​ లీటర్ రూ.106.46 వద్ద కొనసాగుతోంది.

ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర రూ.113.46కు చేరగా.. లీటర్​ డీజిల్​​ ధర రూ.104.38 వద్ద కొనసాగుతోంది.