ఆగని పెట్రో బాదుడు..పండగ రోజూ మోతే!

Non-stop pet duck..mote every day of the festival!

0
100

పెట్రోల్ ధరల పెంపు నుంచి దేశ ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. దసరా రోజు కూడా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాయి చమురు సంస్థలు. ​లో లీటర్ పెట్రోల్​పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచుతున్నట్లు చమురు పంపిణీ సంస్థలు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.33గా ఉండగా, డీజిల్ ధర రూ.102.38కి పెరిగింది.

విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్​పై 31 పైసలు, డీజిల్​పై 37 పైసలు పెరిగింది.  దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.16, డీజిల్ ధర రూ.102.67కు చేరుకుంది.

వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్​పై 34 పైసలు, డీజిల్​పై 37 పైసలు పెరిగింది. ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర రూ.111.05, డీజిల్ ధర రూ.101.74కు చేరుకుంది. చెన్నై, కోల్​కతా, బెంగళూరు నగరాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు అదే స్థాయిలో పెరిగాయి.