తాజాగా బార్క్ విడుదల చేసిన రేటింగ్ లిస్ట్ లో ప్రముఖ ఛానల్ ఎన్టీవీ అగ్రస్థానం సంపాదించుకుంది. గతంలో రేటింగ్స్ విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయి. వాటిని మ్యానిప్యులేట్ చేస్తున్నారని ఆరోపణలు రాగా కొంతకాలం ఈ రేటింగ్స్ ను వెల్లడించడం పూర్తిగా ఆపేశారు. తాజాగా చాలా రోజుల తర్వాత రేటింగ్స్ ను వెల్లడించింది బార్క్. ఈనేపథ్యంలో ఈసారి ఆ సంస్థ విడుదల చేసిన రేటింగ్స్ లో అగ్రస్థానాన్ని అందుకుంది ఎన్టీవీ సంస్థ.
గత 14 వారాలుగా ఈ ఛానల్ అగ్రస్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ కోసం కొన్ని ఇతర ఛానల్స్ తీవ్రమైన పోటీపడగా వరుసగా 14 వారాలుగా టాప్ ప్లేస్ లో ఉంది ఈ సంస్థ. టాప్ పొజిషన్ లో ఒక ఛానెల్ ను ప్రేక్షకులు ఉంచారంటే అది ఎంతగా ప్రేక్షకులను అలరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 24 గంటల వార్తా ప్రసారాలతో మొదలైన ఎన్టీవీ ఎప్పటికప్పుడు వార్తలను త్వరగా ప్రజలకు అందజేయడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతుంది. వాస్తవాలను మాత్రమే ప్రచురిస్తూ, ప్రజలకు ఎంతో నమ్మకంగా ప్రతిక్షణం-ప్రజాహితం అనే స్లోగన్ తో నడుస్తున్న ఛానెల్ ఎన్టీవీ. పిల్లల నుంచి పిన్నల వరకు ఎవరైనా సరే నిజమైన, ఖచ్చితమైన వార్తలు అంటే ఎన్టీవీ అనేంతగా ఛానెల్ ప్రజాదరణ పొందింది.
రేటింగ్స్ లో మొదటి స్థానంలో నిలవడం కోసం అడ్డమైన దారులు తొక్కడం, రేటింగ్స్ కోసం తప్పుడు ప్రచారాలు, అనవసరమైన సంచనాలు ఇలాంటివేమీ ఎన్టీవీ చేయలేదు.. నిజాన్ని ధైర్యంగా చెప్పగలగడం, ప్రజలకు అవసరమైన విషయాల్ని వారి దగ్గరకు చేర్చడం మాత్రమే ఎన్టీవీ చేసింది. ఎన్టీవీ చేసిన ఈ కృషికే ప్రజలు నెం.1 పొజిషన్ తో సత్కరిస్తున్నారు. నిజాన్ని నిర్భయంగా చెబుతూ, అన్యాయాన్ని ఎదిరిస్తూ, ఎవరికీ బెదరకుండా, ఎవర్నీ బెదిరించకుండా ప్రజల పక్షాన నిలబడుతున్న కారణంగానే ప్రజలు ఎన్టీవీని తెలుగు మీడియా రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టారు.
ప్రతి క్షణం-ప్రజా హితం స్లోగన్ ను కేవలం స్లోగన్ గా వదిలేయకుండా ప్రతిక్షణం ఆ మాట మీదే నిలబడటం ఎన్టీవీ ఈ స్థానానికి రావడానికి కారణమైంది. ఈ విజయంపై తుమ్మల నరేంద్ర చౌదరి మాట్లాడుతూ.. చైర్మన్ గా నేనొక్కడినే సాధించింది కాదనీ, ఎన్టీవీ యాజమాన్యంలోని ప్రతి ఒక్కరి కష్టం ఇది అని, ప్రజలు తమకు ఇచ్చిన గౌరవం, తమ పై మరింత బాధ్యతను పెంచిందనీ, ఇదే స్పూర్తితో ముందు ముందు ఎన్నో విజయాలను కూడా అందుకుంటామని నరేంద్ర చౌదరి తెలిపారు.