ఒకాయా విద్యుత్తు స్కూటర్‌ ‘ఫాస్ట్‌’ ఆవిష్కరణ..ధర ఎంతంటే?

Okaya electric scooter 'fast' invention..how much is the price?

0
94

దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాలకు రోజురోజుకి డిమాండ్​ పెరుగుతోంది. దీంతో ఈ మార్కెట్​ను క్యాష్​ చేసుకునేందుకు ఆటో కంపెనీలు పోటీపోటీగా వాహనాలను విడుదల చేస్తున్నాయి. వీటితో పాటు కొత్త స్టార్టప్​ సంస్థలు కూడా ఇందులో అడుగుపెడుతున్నాయి.

తాజాగా ఒకాయా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ విద్యుత్తు స్కూటర్‌ ‘ఫాస్ట్‌’ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఈ వాహన ధర రూ.89,999 (సబ్సిడీలకు ముందు). ఈ స్కూటర్‌కు రూ.1,999 ముందస్తు చెల్లింపుతో బుకింగ్‌లు ప్రారంభించినట్లు వెల్లడించింది.

ఒకాయా ఈవీ వెబ్‌సైట్‌ లేదా డీలర్‌షిప్‌ల వద్ద బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ఎలక్ట్రిక్‌ వాహన ప్రదర్శన- 2021లో ‘ఫాస్ట్‌’ను ఒకాయా పరిచయం చేసింది. త్వరలోనే విడుదల చేయనున్న విద్యుత్తు మోటార్‌సైకిల్‌ ‘ఫెరాటో’ను కూడా సంస్థ ఆవిష్కరించింది.