పెట్రోల్, డిజీల్, వంట నూనె సామాన్యుడిపై పెను భారం మోపుతుంటే తాజాగా ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తుంది. వారం రోజుల్లో ఉల్లి ధర భారీగా పెరిగింది. భారతదేశంలోని అతి పెద్ద ఉల్లిపాయల వాణిజ్య కేంద్రమైన మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌లో టోకు ధరలు రెట్టింపు అయ్యాయి. కేవలం ఒక నెలలో టన్ను ఉల్లి రూ.33,400 కి చేరుకుంది. ముంబై వంటి మెట్రో ప్రాంతాల్లో రిటైల్ ధరలు కిలో రూ.50కి పైగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో ఉల్లి రూ. 40 నుంచి రూ. 50 వరకు ఉంది. కొత్త పంట వచ్చే వరకు ఉల్లి ధర ఎక్కువగానే ఉండొచ్చని మార్కెట్ అధికారులు అంచనా వేస్తున్నారు.
సెప్టెంబరులో మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉల్లి పంట దెబ్బతిందని, దీంతో దిగుబడి తగ్గిందని చెప్పారు. కరోనా సమయంలో ఉల్లి ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ధరలు దిగి వచ్చాయి. మళ్లీ ధరలు పెరగడం పట్ల సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధరలు నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పిటికే చర్యలు చేపట్టింది. బఫర్ స్టాక్ విడుదల చేసింది. అయితే మరింత ధర తగ్గాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లి ఎగుమతిదారుగా ఉంది. ధరల పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, శ్రీలంకలో ధరల పెరిగే అవకాశం ఉంది. ను మరింత పెంచే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.