ఆగని పెట్రో బాదుడు..లీటరు పెట్రోల్ ఎంతంటే?

Petrol is bad again..how much is a liter of petrol?

0
110

వరుసగా మూడో రోజూ చమురు ధరలు పెరిగాయి. దీంతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌పై మరో 35 పైసల చొప్పున పెంచాయి.

దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.106.89కి చేరగా, డీజిల్‌ ధర రూ.95.62కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్‌ రూ.112.78, డీజిల్‌ రూ.103.36, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.107.45, డీజిల్‌ రూ.98.73, చెన్నైలో పెట్రోల్‌ రూ.103.92, డీజిల్‌ రూ.99.92కి చేరాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో మరోసారి చమురు ధరలు ఎగబాకాయి. నగరంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.111.18, డీజిల్‌ రూ.104.32గా ఉంది.