దుమ్మురేపిన ఎస్​బీఐ..

Profit crop for SBI

0
89

దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్. రెండో త్రైమాసికంలో రూ.8,890 కోట్ల ఏకీకృత నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభాలు 69 శాతం వృద్ధి చెందాయి. మొండి బాకాయిలు భారీగా క్షీణించడం సంస్థకు దోహదపడింది. గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.5,245.88 కోట్లుగా ఉందని ఎస్‌బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

రెండో త్రైమాసికంలో ఎస్​బీఐ గ్రూప్ ఆదాయం రూ.1,01,143 కోట్లకు చేరింది. ఇంకా దీన్ని సమీక్షించాల్సి ఉంది. గతేడాది ఇదే సమయంలో సంస్థ మొత్తం ఆదాయం రూ.95,373కోట్లుగా ఉంది. సంతంత్ర ప్రాతిపదికన సంస్థ నికర లాభం 4,574.16 కోట్ల నుంచి 67 శాతం పెరిగి రూ.6504 కోట్లకు చేరింది.

స్థూల నిరర్ధక ఆస్తులు గతేడాది ఇదే త్రైమాసికంతో 5.28 శాతంగా ఉండగా.. ఈ ఏడాది 4.9శాతానికి తగ్గాయి. మెండి బకాయిలు కూడా 1.59శాతం నుంచి 1.52శాతానికి క్షీచించడం వల్ల బ్యాంకు మెరుగైన ఫలితాలు సాధించింది. రెండో త్రైమాసికంలో వడ్డీ ఆదాయం ఎస్‌బీఐకి బాగా కలిసొచ్చింది. ఈ కాలానికి బ్యాంక్‌ రూ.31,184 కోట్ల నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10.65 శాతం ఎక్కువ. నికర వడ్డీ లాభ శాతం (ఎన్‌ఐఎం) 3.34 శాతం నుంచి 3.5 శాతానికి చేరింది.