పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను కొత్త కస్టమర్‌లను చేర్చుకోకుండా నిలిపివేసింది ఆర్‌బీఐ. అలాగే తన అధికారిక ప్రకటనలో పేటీఎం ఐటి సిస్టమ్‌పై సమగ్ర అడిట్ నిర్వహించడానికి ఆడిట్ సంస్థను నియమించాలని ఆదేశించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో గుర్తించిన కొన్ని సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ సంస్థ షేరు భారీగా పతనమవుతోంది. బీఎస్ఈలో మార్చి 14న 13 శాతం వరకు క్షీణించిన పేటీఎం.. నేడు మరో 12.74 శాతం పడిపోయింది. నాలుగు నెలల వ్యవధిలోనే షేరు ఇష్యూ ధరలో 69 శాతం విలువ పడిపోయింది. 2021 నవంబరులో పేటీఎం పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు ఇష్యూ ధర రూ.2,150 కాగా.. నేడు ట్రేడింగ్ ముగిసేనాటికి రూ.589.30కి దిగివచ్చింది.
డాలరుతో రూపాయి మారకం విలువ నేడు రూ.76.53 వద్ద ఉంది. 30 షేర్ల ఇండెక్స్‌లో టాటా స్టీల్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి షేర్లు భారీగా నష్టపోయాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, ఎమ్ & ఎమ్, సిప్లా, శ్రీ సిమెంట్స్, మారుతి సుజుకి షేర్లు రాణించాయి.