ఆర్‌బీఐ అడుగులు ఎటువైపు..ఆ చట్టంలో మార్పులు ఎందుకు?

RBI steps towards digital currency..even changes in the law ..

0
74

ప్రతిపాదిత డిజిటల్‌ కరెన్సీకి సంబంధించిన నమూనాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ నెలలో ప్రకటించవచ్చని ఆర్‌బీఐ ఫిన్‌టెక్‌ విభాగ జనరల్‌ మేనేజర్‌ అనుజ్‌ రంజన్‌ తెలిపారు. ఆ తర్వాత పైలట్‌ ప్రాజెక్టు కింద తీసుకురావొచ్చని..ఇప్పటికే డిజిటల్‌ కరెన్సీ సృష్టికి అవసరమైన చట్టపరమైన మార్పులు ముందస్తు దశల్లో ఉన్నట్లు చెప్పారు.

కరెన్సీ నోట్లతో పాటు చెలామణీ అయ్యేలా డిజిటల్‌ కరెన్సీని తీసుకురావడానికి ఆర్‌బీఐ చట్టం-1934కు మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని ఆర్‌బీఐ కోరిందని ఆర్థిక శాఖ సహాయం మంత్రి పంకజ్‌ ఛౌద్రి ఇటీవల వెల్లడించారు. కొత్తగా ప్రారంభించిన ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌లోనూ పసిడి బాండ్ల కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిదో విడత పసిడి బాండ్ల పథకానికి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటివరకు బ్యాంకులు, స్టాక్‌ మార్కెట్లు, ఎంపిక చేసిన తపాలా కార్యాలయాలు, గుర్తింపు ఉన్న స్టాక్‌ ఎక్స్ఛేంజీలు మాత్రమే పసిడి బాండ్లు విక్రయించేవి.