లోన్​ రికవరీ ఏజెంట్లకు ఆర్​బీఐ స్ట్రాంగ్ వార్నింగ్

0
86

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రికవరీ ఏజెంట్లు రెచ్చిపోయి రుణగ్రహీత పాలిట యమకింకరులుగా మారుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పు ఇచ్చిన బ్యాంక్‌ల కంటే తమ సొమ్మే తీసుకున్నంతగా రికవరీ ఏజెంట్లు ఉసురు తీస్తున్నారు. ‘‘అర్థరాత్రి కూడా ఫోన్​ చేసి అప్పుకట్టాలని అడుగుతున్నారంటూ లోన్​ రికవరీ ఏజెంట్లపై కంప్లైంట్లు అందుతున్నాయి.

బూతులు మాట్లాడుతున్నారని సమాచారం వస్తోంది. ఇలాంటివి ఆమోదనీయం కాదు. ఫైనాన్షియల్​ సంస్థలు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రెగ్యులేటెడ్​ సంస్థలపై అయితే నేరుగా మేం చర్యలు తీసుకుంటాం. అన్​ రిజిస్టర్​ సంస్థలపై పోలీసులు, ఇతర ఏజెన్సీలు చర్యలు తీసుకుంటాయని ఆయన అన్నారు. రికవరీ ఏజెంట్ల ఆగడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వార్నింగ్‌ ఇచ్చారు.