మహిళలకు గుడ్‌న్యూస్‌..మరోసారి తగ్గిన పసిడి ధరలు!

0
103

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావం పసిడిరేట్లపై ప్రభావం చూపుతోంది. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గతూ వస్తున్నాయి. ఇవాళ కూడా అదే కొనసాగింది. ధరలు తగ్గుదలతో బంగారం షాపులు కిటకిటలాడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 50,560 కు చేరింది. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 46,340 గా ప‌లుకుతుంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.

ఇక వెండి ధ‌ర‌లు కూడా ధరలు మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. కేజీ వెండి ధర రూ. 69,000 గా నమోదు అయింది.