ఐఫోన్ కొత్త మోడళ్ల విడుదల..ఫీచర్లు, ధర వివరాలిలా..

0
120

అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేసింది.

ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌: ఐఫోన్‌ 14లో 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ తెర, 14 ప్లస్‌లో 6.7 అంగుళాల తెరను అమర్చారు. మిడ్‌నైట్‌, స్టార్‌లైట్‌, బ్లూ, పర్పుల్‌, ప్రోడక్ట్‌ రెడ్‌ రంగుల్లో లభించనున్నాయి. ఇందులోని బ్యాటరీ ఐఫోన్‌ చరిత్రలోనే అత్యుత్తమమని కంపెనీ చెబుతోంది.

ఏ15 బయోనిక్‌ చిప్‌, 12 మెగాపిక్సెల్‌ వెనుక, ముందు కెమేరాలు ఇందులో ఉన్నాయి. ఐఫోన్‌ 14 ప్రారంభ ధర 799 డాలర్లు (భారత్‌లో రూ.79,900)గా, ఐఫోన్‌ 14 ప్లస్‌ ప్రారంభ ధర 899 డాలర్లు(భారత్‌లో రూ.89,900)గా నిర్ణయించారు. ఐఫోన్‌ 14 సెప్టెంబరు 16న, 14 ప్లస్‌ అక్టోబరు 7న విపణిలోకి రానున్నాయి.

ఎయిర్‌పాడ్స్‌ ప్రో: కొత్త హెచ్‌2 చిప్‌ కలిగిన ఈ హెడ్‌ఫోన్స్‌ 30 గంటల పాటు పనిచేస్తుంది. అయిదు పరిమాణాల్లో లభించనుంది. రెండో తరం ఎయిర్‌పాడ్స్‌ ప్రో ధర 249 డాలర్లు. 23 నుంచి అందుబాటులోకి రానుంది.