కొత్త సంవత్సరంలో కార్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, ఆడి సంస్థలు తమ కార్ల ధరల్ని జనవరి నుంచి పెంచనున్నట్లు ప్రకటించగా..ఇదే బాటలో టాటా మోటార్స్, హోండాలు కూడా సిద్ధమవుతున్నాయి.
ముడి పదార్థాల ధరలు పెరగడం సహా కార్లలో సదుపాయాలు పెంచడం కోసం ఖర్చు పెరిగినందున.. ధరలు పెంచడం మార్గంమనే యెచనలో ఆయా సంస్థలు ఉన్నాయి. మరోవైపు ఒక్కొక్క కారుపై మూడు శాతానికిపైగా ధరలు పెంచుతున్నట్లు ఆడి ప్రకటించింది. పెంచిన ధరలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయిని స్పష్టం చేసింది.
కార్ల తయారీలో ఉపయోగించే ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్‌లతో పాటు వివిధ లోహాల ధరలు బాగా పెరిగాయి. వాహన తయారీలో 75-80 శాతం వాటా ఈ లోహాలదే. దీంతో ఉత్పత్తి వ్యయం భారమైందని నిపుణులు చెబుతున్నారు.