కొత్త వ్యాపారంలోకి స‌మంత ఎంట్రీ ?

Samantha entry into a new business?

0
94

అక్కినేని స‌మంత మామ‌కు త‌గ్గ కోడ‌లుగా వ్యాపార రంగంలో కూడా దుసుకుపోతున్నారు. ఇటు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో సినిమాల‌తో పాటు వ్యాపారాలతో నాగార్జున ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇటు కోడ‌లు స‌మంత కూడా సినిమాలు చేస్తూ స‌రికొత్త వ్యాపారాల‌తో దూసుకుపోతోంది.

ఇప్పటికే ఆమెకు ఏకమ్‌ లర్నింగ్‌ అనే స్కూల్‌తో పాటు సాకీ అనే దుస్తుల లేబుల్‌ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు వ్యాపారాలు సూప‌ర్ స‌క్స‌స్ అయ్యాయి, ఇక మంచి లాభాలు తెస్తున్నాయి. వీటితో పాటు మరో బిజినెస్‌పై ఫోకస్ పెట్టింద‌ట‌ సామ్.

ఇప్పుడు జ్యువెలరీ బిజెనెస్‌లోకి అడుగు పెట్టడానికి సిద్దమవుతుంది.త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా వస్తుందని అంటున్నారు. అయితే ఇది ఆన్ లైన్ బిజినెస్ ఆ లేదా స్టోరా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శాకుంతలం, కాతువకుల రెండు కాదల్ అనే సినిమాల్లో నటిస్తోంది స‌మంత‌.