చైనా కొత్త కంపెనీలు ఏమైనా పెట్టడానికి ఔత్సాహికులు సిద్దంగా ఉంటే వెంటనే తమ దేశంలో వారికి అన్నీ సదుపాయాలు కల్పిస్తుంది. ఇలా కొన్ని వేల కంపెనీలు ఆ దేశంలో ఉన్నాయి. అయితే తాజాగా చైనాకు ఊహించని షాక్ తగిలింది. చైనాలో డిస్ ప్లే తయారీ ప్లాంట్ ను నిర్మించాలని ప్రముఖ సంస్థ శాంసంగ్ నిర్ణయించింది. అయితే, ఆ ప్లాంట్ ను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తరలించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో శాంసంగ్ సీఈవో కెన్ కాంగ్ నేతృత్వంలోని బృందం భేటీ అయింది. మెరుగైన పారిశ్రామిక విధానం వల్ల తాము నొయిడాలో ప్లాంట్ పెడుతున్నాము అని చెప్పారు, ఇక శాంసంగ్ కంపెనీకి సీఎం యోగి పూర్తి భరోసా ఇచ్చారు.భవిష్యత్తులో కూడా శాంసంగ్ కు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.
మొత్తానికి అతి పెద్ద ప్లాంట్ శాంసంగ్ ఇక్కడకు రావడంతో ఇక్కడ ప్రజలు చాలా ఆనందంలో ఉన్నారు. వేలాది ఉద్యోగాలు కూడా ఇక్కడకు రానున్నాయి. ఇది చైనాకు పెద్ద ఎదురుదెబ్బ అంటున్నారు బిజినెస్ అనలిస్టులు.