SBI గుడ్ న్యూస్..ఇక 50 బేసిస్‌ పాయింట్ల అదనపు వడ్డీ..కీలక ప్రకటన వచ్చేసింది!

0
152

ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం SBI సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఎస్.బిఐ వీ కేర్ పథకంపై కీలక సమాచారం అందించింది. ఈ పథకాన్ని 2020 మేలో తీసుకురాగా అదే సంవత్సరం 2020 సెప్టెంబర్ వరకే అందుబాటులో ఉంటుందని తొలుత వెల్లడించారు. కానీ కరోనా కారణంగా పలుమార్లు ఈ పథకాన్ని పొడిగిస్తూ వచ్చింది.

ఇక తాజాగా మరోసారి సీనియర్ సిటిజన్ల కోసం ఈ పథకం గడువును పెంచుతున్నట్టు తెలిపింది. దీనితో 2023 మార్చ్ 31 వరకు పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరనుంది. అయితే సాధారణంగా సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ రేటు కంటే అదనంగా 30 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ ఆఫర్ ను ఈ పథకం అందిస్తుంది.

దీనితో సాధారణ ప్రజల కంటే 50 పాయింట్లు అదనపు వడ్డీ లభిస్తుంది. అంటే మొత్తం 80 పాయింట్లు అదనపు వడ్డీ లభిస్తుందన్న మాట. అయితే ప్రస్తుతం ప్రజలకు 5 ఏళ్ల FD పై 5.65 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్ FD లో డిపాజిట్లకు 6.45 శాతం వడ్డీ లభిస్తుంది.