మహిళలకు షాక్..పెరిగిన బంగారం ధర..తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

0
110

మహిళలకు షాక్..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గగా తాజాగా పెరిగాయి.

పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.350కిపైగా పెరిగి ప్రస్తుతం రూ. 53,590 పలుకుతోంది.

మరోవైపు కేజీ వెండి ధర రూ.500కుపైగా పెరిగింది. ప్రస్తుతం రూ.57,435 వద్ద ఉంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్: పది గ్రాముల బంగారం ధర రూ.53,590గా ఉంది. కిలో వెండి ధర రూ.57,435 వద్ద కొనసాగుతోంది.

విజయవాడ: 10 గ్రాముల పసిడి ధర రూ.53,590వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,435గా ఉంది.