యూజర్లకు షాక్..ఇకపై ఈ ల్యాప్ టాప్ లలో ఆ సేవలు బంద్!

0
94

యూజర్లకు జూమ్ యాప్ బిగ్ షాక్ ఇచ్చింది. కరోనా కష్టకాలంలో స్కూల్ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు, ఉద్యోగులకు మీటింగ్ వంటివన్ని కూడా జూమ్ యాప్ ద్వారానే జరిగేవి. ఈ తరుణంలో జూమ్‌ యాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం యూజర్లకు దెబ్బనే చెప్పుకోవాలి.

ఈ ఏడాది ఆగస్ట్‌ నుంచి క్రోమ్‌ బుక్స్‌ ల్యాప్‌ట్యాప్‌లలో తమ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది యూజర్లకు భారీ షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం క్రోమ్‌బుక్ యూజర్లకు..”ఆగస్ట్ 2022 తర్వాత జూమ్ యాప్ క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్స్‌లో అధికారికంగా సపోర్ట్ చేయదు. కాబట్టి యూజర్లు క్రోమ్ఓఎస్‌లో జూమ్ ఫర్ క్రోమ్-ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ ఉపయోగించాలి. దీని అర్థం క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్‌లలో జూమ్ యాప్ సేవలు ఆగస్టు నుంచి నిలిచిపోయినా.. వీడియో కాల్స్ కోసం జూమ్ ఫర్ క్రోమ్‌ పీడబ్ల్యూఏ అనే జూమ్ వెబ్ యాప్‌ను యూజర్లు వాడుకోవచ్చు.

వాస్తవానికి జూమ్ యాప్ అప్‌గ్రేడ్ చేయని పాత సాంకేతికతపై రూపొందింది. దీని కార్యాచరణ చాలా పరిమితంగా ఉంది. అందుకే డెవలపర్‌లు దీన్ని Chromebooksలో ఆఫ్ చేయాలనుకుంటున్నారు. ముఖ్యంగా జూమ్ 2021లో యాప్‌ను పూర్తిగా షట్ డౌన్ చేసే బదులు Chromebookల కోసం ప్రోగ్రెసివ్ వెబ్ యాప్‌ను ప్రవేశపెట్టింది. గత ఏడాదిలో యాప్ కి సంబంధించిన అప్డేట్లు జరిగాయి.