వాట్సాప్‌ యూజర్లకు బిగ్ షాక్..16 లక్షలకు పైగా ఖాతాలు బ్లాక్!

0
93

ఐటీ నిబంధనలను ఉల్లంఘించే యూజర్లపై వాట్సప్ చర్యలు తీసుకుంటుంది. గత కొంత కాలంగా ఐటీ నిబంధనల్ని ఉల్లంఘించే యూజర్లపై చర్యలు తీసుకొంటున్న ఈ సంస్థ..తాజాగా ఏప్రిల్‌ మాసానికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.

కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగా ఒక్క ఏప్రిల్‌ నెలలోనే భారత్‌లో 16.6 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వాట్సాప్‌ వెల్లడించింది. గత కొంతకాలంగా ఐటీ నిబంధనల్ని ఉల్లంఘించే యూజర్లపై చర్యలు తీసుకొంటున్న ఈ సంస్థ ఏప్రిల్‌లో 844 ఫిర్యాదులు గ్రీవెన్స్‌ సెల్‌కు రాగా..123 అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. అదే మార్చిలో 597 ఫిర్యాదులు రాగా.. 74 అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.

కొత్త ఐటీ నిబంధనలు- 2021 ప్రకారం.. 50 లక్షలకుపైగా యూజర్లు కలిగిన డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు వాటికి సంబంధించిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నెలవారీగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు వాట్సాప్‌ వేదికపై రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించిన 16,66000 ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్‌ తెలిపింది.