ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ) తమ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి నగదు డిపాజిట్ చేసినా.. విత్ డ్రా చేసినా రుసుము చెల్లించాలి. ఈ మేరకు నిబంధనలను సవరించింది ఐపీపీబీ.
ఈ బ్యాంకు ఖాతాదారులకు ఇచ్చిన పరిమితి వరకు నగదు లావాదేవీలు చేసుకోవచ్చు. ఆ పరిమితి దాటితో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ 2022 జనవరి 1న అమల్లోకి రానున్నాయి. దీనితో వినియోగదారులపై భారం పడనుంది. ఐపీపీబీ.. పలు ప్రయోజనాలతో మూడు రకాల పొదుపు ఖాతాలను (సేవింగ్ అకౌంట్స్) వినియోగదారులకు అందిస్తోంది. వేర్వేరు ఖాతాలు ఉన్నవారికి పరిమితులు కూడా వేర్వేరుగానే ఉంటాయి.
ఐపీపీబీలో బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు ఎంత మొత్తమైనా.. ఎన్ని దఫాలైనా.. ఉచితంగా డిపాజిట్ చేయవచ్చు. అయితే నెలకు నాలుగు సార్లు మాత్రమే నగదు ఉచితంగా విత్డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత చేసిన ప్రతి లావాదేవీకి రుసుము చెల్లించాలి. డ్రా చేయాలనుకున్న మొత్తంలో 0.50 శాతం లేదా కనీసం రూ.25 బ్యాంకు వసూలు చేస్తుంది.