హ్యాకర్ల చేతికి చిక్కకుండా సింపుల్ ట్రిక్..ఇప్పుడే ఇలా చేయండి

Simple trick to avoid getting caught by hackers..do it now

0
94

మన ఫోన్​లోని సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొబైల్‌ పరికరాలు హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండేందుకు అమెరికా జాతీయ భద్రతా సంస్థ చేసిన కీలక సూచనలు తెలుసుకుందాం.

నేటి డిజిటల్‌ యుగంలో మొబైల్‌ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువే. ‘పెగసస్‌’ ఉదంతం అనంతరం చాలామంది దీని గురించి భయపడుతూనే ఉన్నారు. ప్రస్తుతం సెల్‌ఫోన్లు రకరకాల ఫీచర్లతో ఊరిస్తున్నాయి. వీటన్నింటినీ వాడుకోవాలనే తాపత్రయ పడుతుంటాం. ఇవి సౌకర్యంగా ఉండొచ్చు గానీ భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు. ఇప్పుడు మొబైల్‌ ఫోన్లు డిజిటల్‌ ఆత్మలుగా మారిపోయాయని చెప్పినా అతిశయోక్తి కాదు. టెక్స్ట్‌ మెసేజ్‌లు, కాంటాక్టులు, ఫొటోలు, వీడియోలు.. ఇలా చెప్పుకొంటూ పోతే లెక్కలేనంత వ్యక్తిగత సమాచారం వీటిల్లో ఉంటుంది. అందుకే వీటిని దొంగిలించటానికి.. మన లొకేషన్‌ను ట్రాక్‌ చేయటానికి హ్యాకర్లు నిరంతరం  ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి మన ఫోన్‌ హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే?

అందుకు.. తేలికైన, సులభమైన మార్గం ఒకటుంది. అదే వారానికోసారి..లేదూ వీలున్నప్పుడల్లా టర్న్‌ ఆఫ్‌, టర్న్‌ ఆన్‌ చేయటం. మొబైల్‌ పరికరాలు హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండటానికి అమెరికా జాతీయ భద్రతా సంస్థ సూచించిన ఉపాయాల్లో ఇదొకటి. కంప్యూటరో, ల్యాప్‌టాపో మొరాయించినప్పుడు సిస్టమ్‌ను ఆఫ్‌ చేసి, ఆన్‌ చేస్తాం కదా. సెల్‌ఫోన్‌ను అప్పుడప్పుడు రీబూట్‌ చేయటమూ అలాంటిదే. దీంతో సైబర్‌ నేరగాళ్లు, గూఢచార సంస్థల నుంచి పూర్తిగా తప్పించుకుంటామని కాదు గానీ ఫోన్‌ నుంచి సమాచారాన్ని తేలికగా దొంగిలించకుండా కాపాడుకోవచ్చు.

సాధారణంగా హ్యాకర్లు ఒకసారి పరికరం లేదా నెట్‌వర్క్‌లోకి చొరపడ్డాక హానికర సాఫ్ట్‌వేర్‌ను సిస్టమ్‌ మూల ఫైల్‌ వ్యవస్థలోకి ప్రవేశపెడతారు. ఇలా నిరంతరం నిఘా వేస్తుంటారు. కోర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోకి మాల్‌వేర్లు ప్రవేశించకుండా అడ్డుకోవటానికి యాపిల్‌, గూగుల్‌ వంటి సంస్థలు గట్టి భద్రత వ్యవస్థను రూపొందించాయి. దీన్ని ఛేదించటం అంత తేలికైన పనికాదు. అందుకే గుర్తించటానికి కష్టమైన, పంపినవారిని పట్టుకోవటానికి వీల్లేని మాల్‌వేర్లను జొప్పించటంపై హ్యాకర్లు దృష్టి సారించారు. ఇలాంటివి ఫోన్‌ను రీబూట్‌ చేసినప్పుడు మనుగడ సాగించలేవు.