వాచ్ లు అంటే ఇష్టపడని వారెవరు ఉండరు. ఈ మధ్య అనేక రకాల వాచ్ లు మార్కెట్ లోకి వచ్చాయి. తక్కువ ధరకు వాచ్ లు అందుబాటులో ఉన్నాయి. దీనితో వీటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది.
Amazfit Bip U Pro Smartwatch: జీపీఎస్ కనెక్టివిటీతో వర్కౌట్స్ ట్రాక్ చేయవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లకు కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 14 రోజులు పనిచేస్తుంది. ధర రూ.4,999.
Realme Watch S TFT: హార్ట్ రేట్ మానిటర్, పెడోమీటర్, కేలరీస్ కౌంటర్, SpO2 మానిటరింగ్, టచ్ స్క్రీన్.. ప్రధాన ఫీచర్లు. బ్లూటూత్‌తో ఆండ్రాయిడ్ డివైజ్‌లకు మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఫుల్ ఛార్జ్‌కు 2 గంటలు పడుతుంది. 15రోజుల వరకు పనిచేస్తుంది. ధర రూ.4,999.
Noise ColorFit Pro 3 Smartwatch: యాక్టివిటీ ట్రాకర్, స్లీప్ మానిటర్, మ్యూజిక్ కంట్రోల్, ఫీమేల్ హెల్త్ కేర్ సపోర్ట్, స్ట్రెస్ మానిటర్, హార్ట్ రేట్ మానిటర్, వెదర్, ఫైన్డ్ ఫోన్ సపోర్ట్.. ఈ వాచ్‌లోని ప్రధాన ఫీచర్లు. బ్లూటూత్‌తో ఆండ్రాయిడ్ ఫోన్స్‌కు కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి ఫుల్‌గా ఛార్జింగ్ పెడితే 10రోజులు పనిచేస్తుంది. ధర రూ.3,499.