త్వరలో మార్కెట్లోకి అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్..ఫీచర్స్, ధరలు ఇలా..

0
96

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం. ప్రస్తుతం అదిరిపోయే మొబైల్ ఫోన్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. వాటి ఫీచర్స్, ధరలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

ఐకూ 9టీ, ఐకూ 10 ప్రో పేర్లతో వీటిని తీసుకురానుంది. ఈ రెండు ఫోన్లలో 120 హెర్జ్‌ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఇస్తున్నట్లు సమాచారం. ఐకూ 9 టీ మోడల్‌ 120 వాట్ ఛార్జింగ్‌కు, ఐకూ 10 ప్రో ఫోన్‌ 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 200 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. జులై రెండో వారంలో ఒక మోడల్‌, చివరి వారంలో మరో మోడల్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది.

నథింగ్ ఫోన్‌ వన్‌ను జూన్‌ నెలలో విడుదల చేస్తారని ప్రకటించినప్పటికీ, కేవలం ముందస్తు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మాత్రమే ప్రారంభించారు. జులై 12న ఈ ఫోన్‌ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫోన్‌ ఫీచర్ల గురించిన సమాచారం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

రియల్‌మీ జీటీ2 మాస్టర్‌ ఎడిషన్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. వీటిలో ముందుగా ఏ మోడల్‌ను విడుదల చేస్తారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. జీటీ నియో 3టీలో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌, 64 ఎంపీ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది