స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్..21 ఏళ్లు దాటిన వారికి లోన్

0
108

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్. అయితే మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. వీటి వలన కస్టమర్స్ కి బెనిఫిట్ కలగనుంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సులభంగానే రుణాలు ఇస్తోంది. తాజాగా ఎస్బిఐ కొత్త కారు తీసుకోవాలని వారికీ శుభవార్త చెప్పింది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

21 ఏళ్ల నుంచి 67 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ లోన్ ని పొందొచ్చు. కారు ఆన్‌రోడ్ ధర లో 90 శాతం వరకు మొత్తానికి ఫైనాన్స్ సదుపాయం కూడా పొందొచ్చు. పైగా వడ్డీ రేటు 7.25 శాతం నుంచి మొదలవుతుంది. ఈ లోన్ ని తీసుకున్న 7 ఏళ్లలో తిరిగి చెల్లించొచ్చు. ఏడేళ్ల వరకు ఈఎంఐ ఆప్షన్ ని పెట్టుకోచ్చు. కార్ లోన్ పొందాలని భావించే వారికి ఎస్‌బీఐ ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తోంది. దీనికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదు. ప్రిపేమెంట్ చార్జీలు కూడా లేవు. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా చెప్పింది.

మీరు కనుక కారు లోన్ పొందాలని అనుకుంటే రెండు ఫోటోలు, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఐటీఆర్, బ్యాంక్ స్టేట్‌మెంట్ అవసరం అవుతుంది. కార్ లోన్‌కు సంబంధించి సమాచారం తెలుసుకోవడానికి 1800-11-2211 నెంబర్‌కు కాల్ చేయొచ్చు. లేదంటే 7208933142 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు. లేదు అంటే 7208933145 నెంబర్‌కు కార్ అని ఎస్ఎంఎస్ పంపితే బ్యాంక్ అధికారులు మీకు రిటర్న్ కాల్ చేస్తారు.

కార్ లోన్‌కు సంబంధించిన వివరాలను పొందొచ్చు. కార్ లోన్ కోసం అప్లై చేసుకోవాలని అనుకుంటే వార్షిక ఆదాయం కనీసం రూ.3 లక్షలు ఉండాలి. వ్యవసాయ రంగానికి చెందిన వారు కూడా లోన్ పొందొచ్చు. వీరి వార్షిక ఆదాయం రూ. 4 లక్షలు ఉండాలి. యోనో యాప్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోచ్చు.