దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులనుద్దేశించి తాజాగా రెండు కీలక ప్రకటన చేసింది. నగదు లావాదేవీలకు సంబంధించి ముఖ్యమైన నిబంధనలను తెలిపింది. ఈ మేరకు ట్విటర్‌లో ఆ వివరాలను పొందుపరిచింది.
ATM నుండి రూ. 10,000 కంటే ఎక్కువ నగదు విత్‌డ్రా చేసుకునే వారి కోసం ఈ ప్రకటన చేసింది ఎస్‌బీఐ. కొత్త నిబంధన ప్రకారం, మీరు 10 వేల కంటే ఎక్కువ మొత్తాన్ని విత్‌డ్రా చేస్తే, దాని కోసం OTP తీసుకోవలసి ఉంటుంది. OTP వినియోగించడం ద్వారా మోసానికి తక్కువ అవకాశం ఉంటుందని, కాబట్టి OTP ఉత్తమ ఉపసంహరణకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
నిజానికి బ్యాంకుల లావాదేవీల్లో పెరుగుతున్న మోసాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌బీఐ అధికారులు పేర్కొన్నారు. OTP ద్వారా డబ్బు విత్ డ్రా చేయడం కూడా అందులో భాగమే. ఇందు కోసం, బ్యాంకులో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ మీ వద్ద ఉండాలి. దానిపై OTP వస్తుంది. మీరు అదే OTP ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. OTP ఆధారిత నగదు లావాదేవీలు 10 వేలకు పైబడిన మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. మీరు అంతకంటే తక్కువ విత్‌డ్రా చేస్తే, ATMలో OTPని నమోదు చేయాల్సిన అవసరం ఉండదు.