Flash News : భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

0
81

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 872 పాయింట్లు నష్టపోయి 58,773కి పడిపోయింది. నిఫ్టీ 267 పాయింట్లు పతనమై 17,490కి దిగజారింది.

మార్కెట్లలో ఈరోజు అన్ని సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఐటీసీ (0.64), నెస్లే ఇండియా (0.28) మాత్రమే లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్ (4.50), ఏసియన్ పెయింట్స్ (3.51), విప్రో (2.96), సన్ ఫార్మా (2.90), ఎల్ అండ్ టీ (2.87) నష్టాల్లో ఉన్నాయి. కాగా అంతర్జాతీయంగా అన్ని కేంద్ర బ్యాంకులు రేట్లను పెంచుతుండటం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.