ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించింది. తాజాగా సంస్థ తీసుకున్న రిటర్న్ టూ ఆఫీస్ ఆలోచనను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఉద్యోగులకు 1600 డాలర్లను బోనస్‌గా చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
కేవలం కంపెనీ ఉద్యోగులకు మాత్రమే కాకుండా..ఈ బోనస్‌ను సంస్థ నియమించుకున్న ఫ్రీలాన్సర్లకు, ఇంటర్న్‌లకు కూడా ఈ ఒన్ టైం క్యాష్ బోనస్ వర్తిస్తుందని గూగుల్ పేర్కొంది. ఈ మొత్తాన్ని ఈ నెలలోనే ఉద్యోగులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఉద్యోగులకు మద్దతుగా నిలవడానికి వర్క్‌ఫ్రమ్-హోమ్ అలవెన్స్, వెల్‌బీయింగ్ బోనస్‌తో పాటు తాజాగా ప్రకటించిన బోనస్‌ను జమ చేయనుంది. గతేడాది మార్చిలో కూడా గూగుల్ ఉద్యోగుల శ్రేయస్సు కోసం 500 డాలర్లను ప్రకటించింది. జనవరి 10 నుంచి ఉద్యోగులను ఆఫీసులకు పిలవాలని భావించినా.. ఒమిక్రాన్ భయాలతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.