తస్మాత్ జాగ్రత్త- నయా వాట్సాప్ స్కామ్..లింక్ క్లిక్ చేస్తే ఇక అంతే సంగతి!

Tasmat caution- new WhatsApp scam..click the link and that's it!

0
110

వాట్సాప్​లో ఇటీవల ఓ స్కామ్​ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అమూల్ డైరీ వార్షికోత్సవాల పేరుతో ఈ కింది లింక్​ను క్లిక్ చేస్తే ఆరు వేలు గెలుచుకోవచ్చు అంటూ ఓ ఫేక్ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఈ లింక్​పై క్లిక్ చేస్తే అంతే సంగతి!

వాట్సాప్​ హ్యాకర్లకు టార్గెట్​గా మారింది. యాప్ యూజర్లకు హ్యాకర్లు మాల్​వేర్​ను పంపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో వాట్సాప్​లో ఇలాంటి స్కామ్​ జరిగింది. ఇండియన్ డైరీ కంపెనీ అమూల్​ 75వ వార్షిక ఉత్సవాల పేరుతో ఆరువేల గిఫ్ట్​ అంటూ ఓ ఫేక్ లింక్ చక్కర్లు కొడుతోంది. లింక్​ను క్లిక్​ చేస్తే ఆరువేలుగెలుచుకోవచ్చు అనే సందేశం ఉంటోంది. ఒకవేళ కనుక ఈ మెసేజ్​కు మీరు స్పందిస్తే ప్రమాదకరమైన మాల్​వేర్ మీ ఫోన్​లో చేరినట్లే. ఎందుకంటే ఆ మెసేజ్​తో పాటు లింక్​ కూడా ఫేక్​.

క్యాష్​ రివార్డ్​ పేరుతో యూజర్లను ట్రాప్​ చేయడానికి హ్యాకర్లు ఇలాంటి మెసేజ్​ సెండ్ చేస్తున్నారు. యూజర్లకు తెలియక ఆ లింక్​పై క్లిక్​ చేసి ఈ స్కామ్​లో చిక్కుకుపోతున్నారు. రివార్డ్​ ఏమీ రాకపోగా.. 10 లేక 15 గ్రూపులకు ఫార్వర్డ్ చేస్తే రివార్డ్​ గెలుచుకునే అవకాశం ఉందని యూజర్లకు గాలం వేస్తున్నారు.

ఇలాంటి ఫేక్ మెసేజ్​లు చాలామంది ఫోన్లలో దర్శనమిస్తుంటాయి. వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, డైరెక్ట్​ మెసేజ్​ల రూపంలో కనిపిస్తుంటాయి. వీటికి వీలైనంత వరకూ దూరంగా ఉండండి. అలాంటి సందేశాలు కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు తెలియజేయండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకూ ఇలాంటి లింక్​లపై అవగాహన కల్పించండి.