వచ్చేసింది ‘టాటా పంచ్’..ధర ఎంతంటే?

‘Tata Punch’ arrives .. What is the price?

0
52

టాటా మోటార్స్ త‌న కొత్త మోడ‌ల్ టాటా పంచ్‌ను లాంచ్ చేసింది. దీని ధ‌ర‌ రూ.5.49 ల‌క్ష‌ల నుంచి రూ.9.09 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంది. మారుతి సుజుకి ఇగ్నిస్‌, రెనాల్ట్ కైగ‌ర్‌, నిసాన్ మాగ్నైట్‌, హ్యుండాయ్ కాస్ప‌ర్‌లాంటి కార్ల‌తో ఈ పంచ్ పోటీ ప‌డ‌నుంది. టాటా పంచ్ ఆ సంస్థ తీసుకొచ్చిన అతి చిన్న ఎస్‌యూవీ. భ‌ద్ర‌త విష‌యంలో ఈ కారుకు 5 స్టార్ రేటింగ్ వ‌చ్చింది. మాన్యువ‌ల్‌, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్ష‌న్స్‌తో పాటు ఏడు రంగుల్లో ఈ పంచ్ కారు అందుబాటులోకి వ‌చ్చింది.

రెండు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్‌, ఫాగ్ ల్యాంప్‌, పారామెట్రిక్ అలారం వ్య‌వ‌స్థ‌, రివ‌ర్స్ పార్కింగ్ కెమెరా, డ్రైవ‌ర్‌, కో డ్రైవ‌ర్ సీట్‌బెల్ట్ రిమైండ‌ర్లు, టైర్ పంక్చ‌ర్ రిపేర్ కిట్‌లాంటి భ‌ద్ర‌తా ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో 7 అంగుళాల హార్మ‌న్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్ అమ‌ర్చారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేల‌ను స‌పోర్ట్ చేస్తుంది.