కుప్పకూలిన స్టాక్ మార్కెట్ – కారణం ఇదే

0
67

అనుకున్నదే జరిగింది. యుద్ధం మొదలైంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఇప్పుడు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఆందోళనగా కలిగిస్తుంది. రష్యా సైనిక చర్యకు దిగడంతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 3 శాతం వరకు నష్టపోయాయి. ట్రేడింగ్ ఆరంభమైన 30 ని.ల్లో BSE విలువ రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైంది. మార్కెట్ విలువ రూ.256 లక్షల కోట్ల నుంచి రూ.246 లక్షల కోట్లకు పడిపోయింది. 3,057 షేర్లలో 2,758 షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. టాటా స్టీల్, ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ 3 శాతం చొప్పున నష్టపోయాయి.