ప్రపంచంలో తొలిసారి బిట్ కాయిన్ ను కరెన్సీగా ప్రకటించిన దేశం

The first country in the world to declare bitcoin as a currency

0
48

ప్రపంచంలో క్రిప్టో కరెన్సీల్లో ఇప్పుడు ఫస్ట్ వినిపించేది బిట్ కాయిన్ గురించే. ఇప్పటికే చాలా మంది దీనిపై పెట్టుబడి పెట్టారు. ఇక కొన్ని దేశాల్లో వీటితో కొన్నింటికి లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం ఆంక్షలు పెట్టాయి. అక్కడ మాత్రం ఎట్టి పరిస్దితిల్లో వీటిని లావాదేవీలకి అనుమతంచడం లేదు. ఇప్పుడు ఓ దేశం తీసుకున్న నిర్ణయం అందరిని షాక్ కి గురిచేసింది.

ఎల్ సాల్వడార్ అనే దేశం బిట్ కాయిన్ ను ఏకంగా కరెన్సీగా ప్రకటించేసింది. ప్రపంచంలో ఇలా ప్రకటించిన మొదటి దేశం ఇదే.
ప్రపంచంలోనే తొలి దేశంగా ఎల్ సాల్వడార్ నిలిచింది. ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే ఈ దేశంలో జాతీయ కరెన్సీగా మాత్రం డాలర్ నే ఉంచారు. దీనిపై వరల్డ్ బ్యాంకు ఇలాంటి నిర్ణయాలు వద్దు అంటోంది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా
కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట.

ఇక దేశంలో అన్ని షాపులు, వాణిజ్య సంస్థలు బిట్ కాయిన్ ను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రజలు పన్నులు కట్టినా వాటిని తీసుకుంటారు. చూడాలి వచ్చే రోజుల్లో ఇక్కడ ఫైనాన్షియల్ గా ఎలాంటి పరిస్ధితి ఉంటుందో.