ఓ పక్క పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి వేళ వంట నూనె ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. కిలో 70 రూపాయల ఉండే ధరలు ఏకంగా 150 రూపాయల వరకూ చేరాయి. ఇక దాదాపు ఆరునెలలుగా చుక్కలనంటాయి ఆయిల్ ధరలు. అయితే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది సామాన్యులకి.
వంట నూనెల రేట్లు ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో డ్యూటీ తగ్గింపు నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 శాతం వరకు ధరల తగ్గింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త ధరలు 2021 జూన్ 17 వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్లో పేర్కొంది.
తగ్గిన ధరలు చూస్తే పామాయిల్ ధర కిలో రూ.115
సన్ ఫ్లవర్ ఆయిల్ కిలో రూ.157
సోయా ఆయిల్ కిలోకు రూ.162
ఆవ నూనె రూ 157
వేరుశనగ నూనె ధర రూ.174
వనస్పతి రూ.141