గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు..ధరలు ఎలా ఉన్నాయంటే..?

0
48

బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. అయితే గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కాగా.. తాజాగా మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి

హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 130 తగ్గి రూ. 50,050 కు చేరింది. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 తగ్గి రూ. 45,900 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. కేజీ వెండి ధర రూ. 6930 తగ్గి రూ. 70,000 కు చేరింది.

విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,050 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,050 గా ఉంది.

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,000, విజయవాడలో రూ.70,000, విశాఖపట్నంలో రూ.70,000 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,990 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,050 లుగా ఉంది.