ఈ మేక ధర అక్షరాల కోటిరూపాయలు ఏమిటి అంత స్పెషల్

The price of this goat is one crore rupees- What's so special

0
109

బక్రీద్ పండుగ కావడంతో దేశంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇక మేకలు, గొర్రెలు వేల సంఖ్యలో కొంటున్నారు. అమ్మడానికి చాలా మంది తీసుకువస్తున్నారు. అయితే ఇలాంటి వేళ ఓ మేక ధర అందరిని షాక్ కి గురి చేస్తోంది. మన దేశంలో ఇప్పటి వరకూ ఇలాంటి రేటు వినలేదు అంటున్నారు ఇది విన్న వారు అందరూ.

మహారాష్ట్రలోని బుల్ధాలా జిల్లాలో ఇక్కడ మీరు చూస్తున్న మేక ధర రూ. 1 కోటి పలికింది. అయితే అందరూ చూస్తు వెళుతున్నారు కాని, ఆ మేకని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వేల రూపాయలు పలకాల్సిన మేక ఎందుకు ఇంత రేటు ఉంది అంటే ? దీనికి కారణం చెబుతున్నాడు ఆ యజమాని.

దాని శరీరం మీద ఉన్న మచ్చ కారణంగానే రూ.కోటి డిమాండ్ చేస్తున్నాడు. అయితే దీనికి శరీరంలో అన్నీ అవయవాలు బాగానే ఉన్నాయి. ఆ మచ్చతోనే ఇంత డిమాండ్ వచ్చింది. శరీరంపై ఉన్న మచ్చ ఉర్దూ భాషలో అల్లా పేరులా కనిపిస్తోంది. ఇది గమనించిన మేక యజమాని దీనిని కోటి రూపాయలు తక్కువకు ఇవ్వను అంటున్నాడు. దానికి టైగర్ అని పేరు పెట్టుకున్నాడు. అయితే కొందరు ఈ మేక కోసం రూ.36 లక్షలు ఇస్తాము అన్నారు. అయినా అతను ఇవ్వను అన్నాడు. కోటి ఇస్తేనే ఇస్తాడట.