2021లో ట్విట్టర్‌ తీసుకొచ్చిన అద్భుతమైన ఫీచర్స్‌ ఇవే..!

These are the amazing features that Twitter has brought in 2021 ..!

0
81

యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ట్విట్టర్‌ అద్భుతమైన ఫీచర్స్‌ను యూజర్లకు పరిచయం చేసింది. అందులో భాగంగా ట్విట్టర్‌ ఈ ఏడాదిలో ఎన్నో ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఈ 2021 ఏడాదిలో ఎలాంటి ఫీచర్స్‌, అప్‌డేట్స్‌ తీసుకువచ్చిందో ఓ సారి చూద్దాం.

తప్పుడు సమాచారం లేబుల్స్ ఫీచర్‌
తప్పుడు సమాచారంపై లేబుల్‌ అప్‌డేట్‌ ఉపయోగపడనుంది. ట్వీట్‌ ఎందుకు తప్పుదారి పట్టించవచ్చునో తెలుసుకునేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడనుంది. ట్విట్టర్‌ ఈ కొత్త ఫీచర్‌ను డిజైన్‌ ప్రారంభించింది.

ట్విట్టర్‌ బ్లూ
ట్విట్టర్‌ బ్లూ అనేది ఓ సబ్​స్క్రిప్షన్ సర్వీస్. ఈ ఫీచర్‌ ట్విట్లను రద్దు చేసే సామర్థ్యం ఉంటుంది. అమెరికాలో నెలకు 2.99 డార్లు (222) ధరతో ప్రకటనలు లేకుండా వార్త కథనాలు చదవడం, లాంగ్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేయడం, ట్విట్టర్‌ యాప్‌లో నేవిగేషన్‌ బార్‌ను కస్టమైజ్‌ చేయడం లాంటి సదుపాయాలు ఈ ఫీచర్‌ ద్వారా పొందవచ్చు. ఇక భారతలో నెలకు రూ.269 ఖర్చు అవుతుంది.

సేఫ్టీ మోడ్ ఫీచర్‌
ఈ సేఫ్టీ మోడ్‌ ఫీచర్‌ను ట్వీట్‌ల రిసీవింగ్‌ ఎండ్‌లో ప్రమాదకరమైన వ్యాఖ్యాలను, కామెంట్లను తగ్గించేందుకు దీనిని రూపొందించారు. విద్వేషపూరితమైన వ్యాఖ్యలు, దుర్భాషలను పంపే అకౌంట్లను ఆటోమేటిక్‌గా బ్లాక్‌ చేసేస్తుంది. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్‌ భాషలో ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌లో ట్విట్టర్‌ టెస్టింగ్‌ దశలో ఉంచింది.

4k ఫోటోల అప్‌లోడ్‌ ఫీచర్‌
ట్వీట్టర్‌లో ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌లో 4K ఫోటోలను అప్‌లోడ్‌ చేయడానికి దీనిని రూపొందించింది ట్విట్టర్‌. వెబ్‌ వెర్షన్‌ ఇప్పటికే అధిక రిజల్యూషన్‌ 4096×4096 ఫోటోల అప్‌లోడ్‌కు ఈ ఫీచర్‌ ఉపయోగపడనుంది. ట్విట్టర్‌ యాప్‌ మొబైల్‌ వెర్షెన్‌లో అప్‌లోడ్‌ కోసం గరిష్టంగా 2048×2048 సైజు వరకు పరిమితి ఉంటుంది.