హైదరాబాద్ కోటి మంది జనాభా ఉన్న నగరం. అంతే కాదు తెలంగాణకు మణిహరం. నిత్యం జిల్లాల నుంచి హైదరాబాద్ మార్కెట్ కు చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో షాపింగ్ చేయవచ్చు. ఇక అనేక షాపుల వారు ఇక్కడకు వచ్చి వందల రకాల వస్తువులు పట్టుకువెళతారు.
ఆడవారి షాపింగ్ మార్కెట్స్ ఇంటి అలంకరణ వస్తువులు ఇలా ఎన్నో మార్కెట్లు ఉన్నాయి.అతి తక్కువ ధరకు వస్తువులు లభించే మార్కెట్స్ ఎక్కువగానే ఉన్నాయి. మరి అవి ఏ వస్తువులకు ప్రసిద్ది చెందాయో ఈ మార్కెట్లు ఏమిటో చూద్దాం.
లాడ్ బజార్.. ఇది చార్మినర్ కు దగ్గర్లో ఉంటుంది. గాజులకు ఫేమస్. స్త్రీల ఆభరణాలు వెండి సామాగ్రి, పట్టు చీరలు, పెళ్లి వస్తువులు, సుగంధ ద్రవ్యాలు మార్కెట్లు ఉన్నాయి, వందల షాపులు ఉంటాయి.
మొజామ్ జాహి మార్కెట్…ఇక్కడ తాజా ఫ్రూట్స్, డెకరేషన్ ఐటెమ్స్, పెళ్లిలకు శుభకార్యాలకు కావాల్సిన పండ్లు, కూరగాయలు సుగంద ద్రవ్యాలు లభిస్తాయి.
షాపింగ్ హబ్ నాంపల్లి గాజులు, బ్యాగులు ఎక్కువగా లభిస్తాయి, ట్రావెల్ బ్యాగ్స్ కు ప్రసిద్ది
బేగం బజార్.. ఈ మార్కెట్ దాదాపు 150 సంవత్సరాల నుంచి ఉంది. ఇంటి అలంకరణ వస్తువులతోపాటు, వివాహానికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి, హైదరాబాద్ లో అతి పెద్ద మార్కెట్ ఇది.
కోటి మార్కెట్.. స్త్రీల ఆభరణాలతోపాటు, పుస్తకాలు, వాచీలు, బ్యాగులు ఇలాంటి వస్తువులు అమ్ముతారు.