పెళ్లిళ్ల సందడి మొదలైంది మంచి ముహూర్తాలు ఇవే

These are the good moments when the wedding buzz begins

0
89

శ్రావణమాసం వచ్చేసింది. కొత్త ముహూర్తాలు తెచ్చింది. ఇక పెళ్లి సందడి మొదలైంది .శ్రావణ మాసంలో పెళ్లిళ్లతో పాటు పలు రకాల శుభకార్యాలకు రెడీ అయిపోయారు ప్రజలు. ఈ కరోనాతో వాయిదా పడిన పెళ్లిళ్లు ఇప్పుడు మొదలు అవనున్నాయి.
ఇక అందరూ బిజీ అవ్వనున్నారు. దాదాపు 18 నెలలుగా సరైన వ్యాపారం లేక అనేక ఇబ్బందులు పడ్డారు అందరూ.

ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. ఫోటోగ్రాఫర్లు, పురోహితులు, లైటింగ్, కేటరింగ్, డేకరేషన్, ఫ్లవర్స్ మర్చంట్స్ ,ఫంక్షన్ హాల్స్, టైలర్స్ కు ఇక మంచి డిమాండ్ ఉంటుంది. ఇక బంగారం బట్టల షాపులు కూడా కస్టమర్లతో కళకళలాడతాయి.

ఆగస్ట్ లో 12, 13, 14, 16, 18, 20, 21, 22, 25, 26, 27 ముహూర్తాలు ఉన్నాయి.
సెప్టెంబర్ 2నుంచి అక్టోబర్ 5వరకు శుభముహూర్తాలు లేవు.
అక్టోబర్ 7, 8,10 15, 16, 17, 20, 21, 23, 24, 31న ముహూర్తాలు ఉన్నాయి.
ఇక కార్తీక సమాసం నవంబర్ లో 6, 10, 12, 13, 17, 20, 21 తేదీలు ముహూర్తాల ఉన్నాయి
డిసెంబర్ లో 5, 8, 9, 10, 12, 17, 18, 19, 24 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి అంటున్నారు పండితులు.