ఈ పక్షి రెక్కలు బంగారం కంటే విలువైనవి వాటిని ఏం చేస్తారంటే

This Bird wings are more valuable than gold

0
110

ఈ భూమి మీద అనేక రకాల జంతువులు ఉన్నాయి. ముఖ్యంగా చాలా రకాల పక్షులు ఉన్నాయి. కొన్ని పక్షులు అంతరించిపోయే దశలో కూడా ఉన్నాయి. వాటిని కొన్ని దేశాలు సంరక్షిస్తున్నాయి. అయితే మనకు తెలియని వింత పక్షులు చాలా ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి. ఎందుకు అంటే దీని రెక్కలు ఈకల ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు.
ఈ పక్షి నుంచి వచ్చే ఈకలు చాలా విలువైనవి. ఐస్ల్యాండ్లో నివసిస్తున్న ఈడర్ పోలార్ డక్ ఇది చాలా రేర్ పక్షి.

చెప్పాలంటే దీనిని సహజ ఫైబర్గా చెబుతారు. చాలా ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు తయారు చేసే కంపెనీలు వీటిని ఉత్పత్తిలో వాడతాయి. ఈ ఫైబర్ చాలా తేలికగా ఉంటుంది. శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఈ ఫైబర్ కి ఎంతో డిమాండ్ ఉంది.
ఈ పక్షి గుడ్లు పొదిగినప్పుడు ఈ ఫైబర్ తయారవుతుంది. వీటి ఈకలు దొరికిన తర్వాత ఆ ఫైబర్ తీసుకుని అమ్ముతారు.
800 గ్రాముల ఫైబర్ ధర మార్కెట్లో 5000 డాలర్ల ధర ఉంది.

ఇవి చాలా రేర్ గా కనిపిస్తాయి, ఇక ఆ పక్షి గుడ్లు పొదిగే సమయంలో అక్కడి ప్రజలు వాటి ఈకలను సేకరించేందుకు వెళ్తుంటారు. ఒక కిలో ఫైబర్ కోసం 60 బాతు గూళ్ళను వెతుకుతారట. మరో విషయం ఎవరూ కూడా ఈ బాతులని చంపరు.