దేశంలో జూన్ 15 నుంచి బంగారం అమ్మకాలపై హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి అమలు చేయనుంది ప్రభుత్వం. నగలపై కచ్చితంగా హాల్ మార్కింగ్ ఉండాల్సిందే. ఇప్పటికే పెద్ద పెద్ద షాపులు ఈ హాల్ మార్కింగ్ ఉన్న నగలు అమ్ముతున్నారు. ఇక చిన్న దుకాణాలు కూడా కచ్చితంగా హాల్ మార్కింగ్ నగలు మాత్రమే అమ్మాలి.
బంగారం స్వచ్ఛతకు ధ్రువీకరణే హాల్‌మార్కింగ్. ఇక కచ్చితంగా హాల్ మార్కింగ్ ఉన్న నగలు మాత్రమే దేశ వ్యాప్తంగా అమ్మాలి. అంతేకాదు హాల్ మార్కింగ్ లేకపోతే కచ్చితంగా ఆ నగలు మీరు తీసుకోవద్దు.
బంగారం క్వాలిటీ హాల్ మార్కింగ్ తెలియచేస్తుంది, ఇక పల్లెల నుంచి పట్టణాల వరకూ అన్నీ బంగారు షాపుల్లో నగలకు ఈ హాల్ మార్కింగ్ ఉండాల్సిందే. ఒకవేళ హల్ మార్కింగ్ లేని నగలు అమ్మితే ఎవరూ తీసుకోవద్దు.