బంగారం ధర గత వారం రోజులుగా పెరుగుదల నమోదు చేస్తోంది. ఆల్ టైం హైకి మే నెల నుంచి జూన్ కి చేరింది. పసిడి బాటలో వెండి ధర కూడా పరుగులు పెట్టింది. అయితే తాజాగా నేడు బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టింది. బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది. దీంతో రేటు రూ.50 వేలకంటే తగ్గింది. రూ.49,970కు ట్రేడ్ అవుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.110 తగ్గుదలతో రూ.45,800కు ట్రేడ్ అవుతోంది.
బంగారం ధర దిగివస్తే వెండి రేటు కూడా రూ.500 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.75,800కు చేరింది. బంగారం, వెండి ధరలు వచ్చే రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు బులియన్ వ్యాపారులు.